ప్రిన్స్ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వేసవి కానుకగా మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం గురించి బయట రకరకాల రూమర్లు వున్నప్పటికీ ఈ చిత్రంపై వున్న క్రేజే వేరు. మహేష్‌బాబుకి కుటుంబ ప్రేక్షకుల్లో వున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ‘బ్రహ్మోత్సవం’ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కథలో కాస్త విషయం వున్నా ‘బ్రహ్మోత్సవం’కు కుటుంబ ప్రేక్షకుల నీరాజనం ఖాయం. అయితే ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో మహేష్‌బాబు క్రింద కూర్చొని చెప్పులు పట్టుకుంటూ వుంటాడు.. ఇప్పుడు ఈ పోస్టర్‌లో మహేష్ పాత్రలోని సింప్లీసిటిని.. సినిమాలోని భావోద్వేగాలు తెలియపరుస్తుంది. అయితే కొంత మంది మాత్రం ఇది మహేష్ నటించిన ప్యారగాన్ చెప్పుల యాడ్‌లో ఫోటోలా వుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఈ కామెంట్స్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు.