Advertisementt

పవన్ సినిమా లీకైందా..?

Thu 07th Apr 2016 07:24 PM
pawan kalyan,sardhar gabbar singh,kadapa district  పవన్ సినిమా లీకైందా..?
పవన్ సినిమా లీకైందా..?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉండగా చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రతి సినిమాకు పైరసీ వచ్చేస్తుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా రిలీజ్ కు ముందే లీకై అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు 'సర్దార్' విషయంలో కూడా అదే జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో ఈ సినిమా సీడీల రూపంలో విడుదలైందని పోలీసులకు తెలిసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ సీడీ షాప్స్ పై దాడులు చేసి హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. సినిమా ఎలా లీకైందో.. తెలియట్లేదు గానీ ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేశారు. అయితే ఎటువంటి సీడీలు దొరకలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ విషయం 'సర్దార్' టీంతో పాటు అభిమానులకు కూడా పెద్ద షాక్ ఇచ్చింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ