కలెక్షన్ కింగ్ మోహన్ బాబు త్వరలోనే ఓ రాజకీయ పార్టీలోకి చేరబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, నేను రాజకీయాల్లోకి రావాల్సిన సమయం వచ్చిందని స్వయంగా మోహన్ బాబే తెలిపారు. తను ఏ పార్టీలో చేరిన అన్ని కులాల, మతాల ప్రజలు తన వెంటే వస్తారని ఎంతో నమ్మకంతో మాట్లాడారు. అయితే తను ప్రత్యేకంగా ఎలాంటి రాజకీయ పార్టీను స్థాపించట్లేదని స్పష్టం చేశారు. కొంతకాలంగా జగన్, తన సన్నిహితులు మోహన్ బాబుతో మంతనాలు సాగిస్తునట్లు సమాచారం. బిజెపి అధికారంలోకి వచ్చిన మొదట్లో.. ఆ వైపుగా ఆసక్తి చూపినా.. ప్రస్తుతం మాత్రం మోహన్ బాబు, జగన్ పార్టీలో జాయిన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరి మోహన్ బాబు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..!