Advertisementt

పవన్‌ వాడకం అంటే అలాగే ఉంటుంది!

Thu 07th Apr 2016 10:49 AM
pawan kalyan,sardaar gabbar singh,guns,pawan kalyan movies  పవన్‌ వాడకం అంటే అలాగే ఉంటుంది!
పవన్‌ వాడకం అంటే అలాగే ఉంటుంది!
Advertisement
Ads by CJ

పవన్‌కళ్యాణ్‌కు పక్కన అలీ లేకపోయినా, గన్‌ చేతిలో లేకపోయినా అసలు నిద్రే పట్టదు. హాలీవుడ్‌లో వాడే అత్యాధునిక గన్స్‌ విషయంలో కూడా పవన్‌ అప్‌డేటెడ్‌గా ఉంటాడు. తుపాకి అంటే పవన్‌కు ఆరో ప్రాణం అని చెప్పుకోవాలి. సినిమాలో గన్‌ వాడే అవకాశం లేకపోతే కనీసం ఒక పాటలోనైనా సరే ఆయన గన్‌తో కనిపించాల్సిందే, 'బద్రి, అన్నవరం, గుడుంబా శంకర్‌, పంజా, జల్సా' ఇలా అనేక చిత్రాల్లో పవన్‌ చేతిలో గన్‌ కనిపిస్తుంది. ఇక 'గబ్బర్‌సింగ్‌'లో ఆయన వాడిన గన్స్‌కు, బుల్లెట్లకు లెక్కేలేదు. కాగా ఈనెల 8న విడుదల కానున్న తన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో కూడా పవన్‌ దాదాపు 20 రకాల ఆధునిక గన్స్‌ను వాడాడట. ఒక యాక్షన్‌ ఎపిసోడ్ లో ఏకంగా 700 గన్స్‌ను వాడినట్లు సమాచారం. మొత్తానికి గన్స్‌ వాడటమే కాదు.. ఆ సౌండింగ్‌పై కూడా పవన్‌ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడట. మొత్తానికి ఉగాదినాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు పవన్‌ పేల్చే గన్‌లతో మారుమోగనున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ