Advertisementt

మహేష్ హీరోయిన్ ఛాన్స్ కొట్టింది!

Wed 06th Apr 2016 09:56 PM
krithi sanon,mahesh babu,ajith,siva,kollywood  మహేష్ హీరోయిన్ ఛాన్స్ కొట్టింది!
మహేష్ హీరోయిన్ ఛాన్స్ కొట్టింది!
Advertisement
Ads by CJ

'1(నేనొక్కడినే)' సినిమాలో మహేష్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది కృతి సనన్. ఆ సినిమాకు నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో కృతి సనన్ ను ఎవరు పట్టించుకోలేదు. ఆ తరువాత చాలా గ్యాప్ తో నాగ చైతన్యతో 'దోచేయ్' సినిమాలో నటించింది. ఆ సినిమాకు కూడా ఫ్లాప్ టాక్ రావడంతో టాలీవుడ్ లో కృతి కు ఒక్క అవకాశం కూడా లేకుండా పోయింది. కాని సడెన్ గా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖాన్ 'దిల్ వాలే' సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. దీంతో ఈ అమ్మడు కెరీర్ కు ఇక డోకా లేదనుకున్నారంతా.. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యి.. కృతి సనన్ కు షాక్ ఇచ్చింది. బాలీవుడ్ లో తన కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. టాలీవుడ్, బాలీవుడ్ లలో కృతికి హిట్స్ రాకపోయినా.. కోలీవుడ్ నుండి మరో అవకాశం తలుపు తట్టింది. తమిళ స్టార్ హీరో అజిత్, దర్శకుడు శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా కృతిని సెలెక్ట్ చేసుకున్నారట. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలనే ప్రయంత్నంలో కృతి ఉన్నట్లు తెలుస్తోంది..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ