Advertisementt

పవన్ ఫ్యాన్స్ కు వర్మ సలహాలు!

Wed 06th Apr 2016 09:38 PM
ram gopal varma,sardhar gabbar singh,pawan kalyan  పవన్ ఫ్యాన్స్ కు వర్మ సలహాలు!
పవన్ ఫ్యాన్స్ కు వర్మ సలహాలు!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ను రామ్ గోపాల్ వర్మ అప్పుడే వదిలేలా కనిపించడం లేదు. 'సర్దార్' సినిమా రిలీజ్ అవుతుందన్న దగ్గర నుండి వర్మ, పవన్ గురించి తన సినిమా గురించి ఏదొక ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. పవన్ సినిమా హిందీలో రిలీజ్ చేయొద్దని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. అయితే రీసెంట్ గా మరో ట్వీట్ చేశాడు. ఈసారి పవన్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఈ ట్వీట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన రోజున పవన్ అభిమానులు టేపులు తెచ్చుకోవాలట. ఎందుకంటే సినిమా రిలీజ్ రోజు జనాలు ఎంతగా క్యూ కడతారో కొలుచుకోవడానికట. బాహుబలి సినిమా రిలీజ్ రోజు ప్రసాద్‌ ఐ మ్యాక్స్‌ వద్ద 1.5 కిలోమీటర్లు క్యూ కట్టారని, ఇప్పుడు పవన్ కళ్యాన్ సినిమా క్యూ ఎంత పెద్దగా ఉంటుందో తెలుసుకోవాలని వుందని, అందుకే ఆ క్యూలను టేప్‌లతో కొలిచి ప్రభాస్‌ కన్నా పవన్‌ కళ్యాణ్ గొప్పని ప్రపంచానికి చాటి చెప్పాలని వర్మ తన ట్విట్టర్ ద్వారా చెప్పాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ