Advertisementt

ఆ కుర్ర హీరోపై తమన్నా మనసు పడింది!

Wed 06th Apr 2016 09:29 PM
thamanna,natural star,nani,oopiri,mahesh babu  ఆ కుర్ర హీరోపై తమన్నా మనసు పడింది!
ఆ కుర్ర హీరోపై తమన్నా మనసు పడింది!
Advertisement
Ads by CJ

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోన్న నటి తమన్నా. రీసెంట్ గా 'ఊపిరి' చిత్రంతో హ్యాట్రిక్ కొట్టింది. సౌత్ లో పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించింది. బహుశా అందరితో నటించేసానని అనుకుందో.. ఏమో..! ఇప్పుడో కుర్ర హీరోతో నటించాలని ఆశ గా ఉందని తన మనసులో మాటను చెప్పింది మిల్కీ బ్యూటీ. న్యాచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నాని నటనను చూసి ఇంప్రెస్ అయిన తమన్నా తనతో ఒక్కసారైనా నటించాలనుందని బహిరంగంగానే చెప్పింది. అలాంటి నటులతో పని చేస్తే న‌టిగా మ‌రింత ఇంప్రూవ్ అవ్వొచ్చ‌ని త‌మ‌న్నా అంటోంది. మరి నాని ఈ మాట విని ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ