పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతుందడంతో పవన్ అభిమానులు టికెట్స్ సంపాదించే పనుల్లో పడ్డారు. ఒక అభిమాని అయితే ఏకంగా తన ఇల్లును అమ్మి మరీ సర్దార్ టికెట్స్ కొన్నాడు. ఇది ఇలా ఉండగా 'సర్దార్' సినిమా డ్యూరేషన్ సుమారుగా రెండు గంటల నలభై రెండు నిమిషాలు. ఈ మధ్యకాలంలో ఇంత నిడివి గల సినిమాలు రావట్లేదు. రెండున్నర గంటలకు మించి సినిమా ఉంటే దాన్ని చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చుపట్లేదు. ఈ నేపధ్యంలో పవన్ సినిమా నిడివి తగ్గించాలని దర్శకనిర్మాతలు భావించారు. కాని ఈ విషయం పవన్ దగ్గర ప్రస్తావించగా సినిమా డ్యూరేషన్ తగ్గించే ఛాన్సే లేదని చెప్పేశాడట. దీంతో నిర్మాత శరత్ మరార్ పవన్ ను కొంత శాంతింపజేసి అసలు విషయాన్ని వివరించాడట. ఇక పవన్ తనకు ఇష్టం లేకపోయినా.. శరత్ మాటలకు గౌరవమిచ్చి సినిమాను ట్రిమ్ చేయడానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే మరీ పావుగంట సేపు కాకుండా ఓ పది నిమిషాల సినిమాను ట్రిమ్ చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది..!