రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు క్రేజ్. ఇప్పుడు డేంజర్. వర్మ పేరు చెబితే టాలీవుడ్ హీరోలు నిద్రలో సైతం ఉలిక్కిపడుతున్నారు. బాలీవుడ్ పొమ్మంటే టాలీవుడ్ కు చేరుకుని తెలుగు హీరోలకు ఫ్లాప్ లు తీసివ్వడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆయనకు మెుదటి నుండి తెలుగు ఆర్టిస్టులంటే చిన్నచూపు. నాగార్జున తర్వాత జె.డి.చక్రవర్తిని మినహా ఇతర హీరోలను విశ్వసించలేదు. అందుకే తెలుగు చిత్రాలు తీసినా వాటిలో హిందీ ఆర్టిస్టులను తెచ్చిపెట్టేవారు. అనంతపురం ఫ్యాక్షన్ కథ రక్తచరిత్రను బాలీవుడ్ హీరోలతోనే తీశారు. అలాంటి వర్మ తెలుగు హీరోలు అందరినీ టార్గెట్ చేసినట్టు వరుసగా ఫ్లాప్ లిచ్చారు. కామెడీని నమ్మకున్న సునీల్ కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు అంటూ తలతిక్క సినిమా తీసి బ్రేక్ వేశారు. రవితేజ, మోహన్ బాబు, మంచు బ్రదర్స్, సిస్టర్, నవదీప్, నితిన్ ఇలా అందరికీ వరుస పెట్టి ఫ్లాప్ లిచ్చి ఇప్పుడు రిలాక్స్ అయ్యాడు. ఈ స్వయంప్రకటిత సినీ మేధావి ఇటీవలే తీసిన ఎటాక్ దాదాపుగా ఆయనకు చివరి చిత్రం అయ్యే అవకాశం ఉందని వర్మ సన్నిహితులే అంటున్నారు. వయసు మీద పడడం, వ్యక్తిగత జీవితం అంటూ లేకపోవడం వల్ల వర్మ గందరగోళంలో ఉన్నారని సన్నిహితులు అంటున్నారు. ఒకప్పుడు ఎందరికో స్పూర్తి కలిగించిన వర్మ ఇప్పుడు ఫ్లాప్ లు ఎలా తీయాలో అని కూడా చెబుతున్నట్టుంది. ఆయన స్కూల్ అప్పుడు, ఇప్పుడు యువ దర్శకులకు బాగా ఉపయోగపడుతోంది.