ఏడాది కాలం నుండి 'బాహుబలి' రికార్డులు చెక్కుచెదరలేదు. మహేష్ 'శ్రీమంతుడు' చిత్రం రికార్డులను క్రియేట్ చేసినప్పటికీ 'బాహుబలి' రికార్డులకు ఎంతో దూరంలో ఆగిపోయింది. కాగా 'బాహుబలి' చిత్రం తెలుగులో 110కోట్లను వసూలు చేసింది. కాగా ఈ రికార్డులను పవన్ నటిస్తున్న 'సర్దార్‌గబ్బర్‌సింగ్' తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రం ఏకంగా 3500 థియేటర్లలో విడుదలకు సిద్దం అవుతోంది. కాగా ఈ చిత్రం మంచి హిట్ టాక్ వస్తే 'బాహుబలి'ని దాటడం ఖాయమంటున్నారు. ఇక ఓపెనింగ్స్ విషయంలో 'సర్దార్' చిత్రం సంచలనానికి నాంది పలకనుంది. ఈ చిత్రం హిందీలో కూడా విడుదల అవుతున్న దృష్ట్యా పవన్ అక్కడ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటాడా? లేక తెలుగులో లాగానే కేవలం ఇంటర్వ్యూలకే పరిమితం అవుతాడా? అన్నది వేచిచూడాల్సివుంది ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్ధ మాత్రం ఈ చిత్రం ప్రమోషన్‌లో చురుగ్గా పాల్గొనాలని పవన్‌పై ఒత్తిడి తెస్తోందని సమాచారం. కానీ పవన్ మాత్రం సినిమాలో విషయం ఉంటే ప్రమోషన్ లేకపోయినా బాగా ఆడుతుందని, సినిమాలో విషయం లేకపోతే ఎంతగా ప్రమోషన్ చేసినా లాభం ఉండదని బద్దలు కొట్టినట్లు.. ఈరోస్‌కు సమాధానం ఇచ్చాడని సమాచారం. సో..పవన్ కాన్ఫిడెంట్ చూసిన పవన్ అభిమానులు .. ఈ మూవీ 'బాహుబలి', 'శ్రీమంతుడు' లకి చెక్ పెట్టడం ఖాయం అంటూ సంబరాలు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.