Advertisementt

మహేష్ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్..!

Tue 05th Apr 2016 07:29 PM
mahesh babu,brahmothsawam,srikanth addala  మహేష్ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్..!
మహేష్ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్..!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటిస్తోన్న 'బ్రహ్మోత్సవం' సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 20 నాటికి సినిమా షూటింగ్ పూర్తవుతుంది. దీంతో మే 6న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ.. స్వయంగా యూనిట్ సభ్యులే మే 6న సినిమాను రిలీజ్ చేస్తున్నామని చెప్పడం విశేషం. ఏప్రిల్ 24న తిరుపతిలో గ్రాండ్ గా ఈ సినిమా ఆడియో విడుదల చేయనున్నారని సమాచారం. అయితే అదే రోజు మహేష్ తో మరో ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నారు. నితిన్ నటిస్తోన్న 'అ ఆ' మూవీ, సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న 'సుప్రీమ్' ఈ రెండు చిత్రాలు అదే రోజున రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మరి మహేష్ కు పోటీగా నిలబడతారో.. లేక రెండు వారాలు ఆగి వస్తారో.. చూడాలి..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ