Advertisementt

మళ్ళీ నయనతార బ్రేకప్!

Tue 05th Apr 2016 01:37 PM
nayanathara,vighnesh shivan,nanum rowdythan  మళ్ళీ నయనతార బ్రేకప్!
మళ్ళీ నయనతార బ్రేకప్!
Advertisement
Ads by CJ

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్న నటి నయనతార. తన ప్రేమయణాలతో తరచూ వార్తల్లో కనిపించేది. శింబుతో బ్రేకప్ అయిన తరువాత ప్రభుదేవాను ప్రేమించింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కాని చివరి నిమిషంలో కుదరలేదు. ప్రభుదేవాతో విడిపోయిన తరువాత మళ్ళీ సినిమాలతో బిజీగా మారిపోయింది. రీసెంట్ గా 'నానుం రౌడీతాన్' అనే సినిమాలో నటించింది. ఇదే సినిమా 'నేను రౌడీనే' అనే పేరుతో రిలీజ్ అయింది. ఈ చిత్ర దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో నయన మరోసారి ప్రేమలో పడింది. కాని వీరి రిలేషన్షిప్ ను చాలా గోప్యంగా ఉంచింది. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. కాని ఆ వార్తలు అవాస్తవమని ఈ జంట తేల్చేసింది. అయితే ఇటీవల విఘ్నేశ్ పెళ్లి చేసుకుందామని.. నయనతారను అడగగా.. ఆమె ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని కొంత కాలం తరువాత పెళ్లి చేసుకుందామని చెప్పింది. దీంతో వీరి మధ్య గొడవ జరిగి విడిపోయేవరకు వెళ్ళారని సమాచారం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ