Advertisementt

'ఎవడితడు..?' అంటోన్న నాని!

Tue 05th Apr 2016 12:17 PM
nani,indraganti mohan krishna,evadithadu movie  'ఎవడితడు..?' అంటోన్న నాని!
'ఎవడితడు..?' అంటోన్న నాని!
Advertisement
Ads by CJ

నాని హీరోగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ నేపధ్యంలో సాగే ఈ కథ ఇప్పటికే డెబ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాకు టైటిల్ గా 'ధమాకా' ,'జెంటిల్ మెన్' అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాని ఈ రెండు కాకుండా ఇప్పుడు చిత్రబృందం మరో టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మర్డర్ మిస్టరీతో సస్పెన్స్ ఎలిమెంట్స్ తో నడిచే ఈ కథకు 'ఎవడితడు' అనే టైటిల్ అయితే ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం భావిస్తోంది. నాని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్ లో ఇదివరకు 'అష్టాచమ్మా' అనే సినిమాను రూపొందించారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. మరోసారి వీరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడం,' భలే భలే మగాడివోయ్','కృష్ణగాడి వీరప్రేమ గాధ' వంటి హిట్ చిత్రాల తరువాత నాని నటిస్తోన్న సినిమా కావడంతో ఇప్పటకే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి నాని 'ఎవడితడు' తో మరో హిట్ కొడతాడేమో  చూడాలి..!