నాగార్జున, కార్తి కలిసి నటించిన 'ఊపిరి' సినిమాకు సీక్వెల్ రాబోతుందా..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. ఫ్రెంచ్ ఫిలిం 'ఇన్ టచబుల్స్' కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను సాధిస్తోంది. అంతే కాదు ఎందరికో స్పూర్తిగా నిలిచింది. మనిషికి తోడుంటే చాలు.. ఎలా అయినా.. బ్రతికేయొచ్చు అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో చిత్రబృందం ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని భావిస్తోంది. చెన్నైలో జరిగిన 'ఊపిరి' సినిమా సక్సెస్ మీట్ లో నాగార్జున, కార్తీ.. 'ఊపిరి' చిత్రానికి సీక్వెల్ రాబోతుందని ప్రకటించారు. 'ఇన్ టచబుల్స్' సినిమాకు సీక్వెల్ రాలేదు. కాని దానికి రీమేక్ గా చేసిన ఈ సినిమాకు మాత్రం సీక్వెల్ చేస్తున్నారు. ఈ విషయం గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది..!