మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతో సంతోషంగా వున్నాడు.. ఇన్నాళ్లు కూతురు శ్రీజ భవితవ్యం గురించి తెగ మదనపడిపోయిన చిరు ఇప్పుడు మానసికంగా ఎంతో రిలాక్స్ అయ్యాడు. మొదట్లో తన చిన్న కూతురు శ్రీజ పెళ్లిని ఎంత అంగరంగ వైభవంగా జరిపించాలని అనుకున్నాడో.. అంతకు మించిన అంగరంగ వైభవంగా.. కనివినీ ఎరుగని రీతిలో.. ఆకాశమంత పందిరి.. భూదేవి అంతా అరుగు వేసి ఇతరులు అసూయపడేలా అత్యంత వైభవంగా శ్రీజ వివాహా వేడుకను జరిపించాడు. మొదట తను శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహాం చేసుకుని ఎలాంటి ఆనందాన్ని.. కోల్పొయిందో.. ఆ ఆనందాన్ని కూతురుకు ఎంతో ఆప్యాయంగా తిరిగి ఇచ్చాడు చిరు. శ్రీజకు గతం తాలుకూ జ్ఞాపకాలు ఏ మాత్రం గుర్తుకు రాకుండా.. ఆనంద డోలికల్లో ముంచి తేల్చడానికి ఓ తండ్రిగా ఎంత చేయాలో అంత చేశాడు చిరంజీవి. ఈ పెళ్లి వేడుకలో చిరు ముఖంలో కూడా ఆనందం వెల్లివిరిసింది. ఇక వివాహాం తర్వాత విడుదలైన వీడియోలు చూస్తే శ్రీజ.. కూడా ఎంత హ్యాపీగా వుందో అర్థమవుతుంది..! సో.. ఈ విషయంలో ఓ తండ్రిగా చిరంజీవికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు ఆయన సన్నిహితులు.