నాలుగేళ్ల క్రితం దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా కోటి రూపాయల పారితోషికం తీసుకున్న గోవా బ్యూటీ ఇలియానా.. బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అక్కడ టాప్ హీరోయిన్ అయిపోవాలని కలలు కన్న ఇల్లీబేబీకు పాపం పెద్దగా కలిసి రాలేదు. రెండు, మూడు అవకాశాలు వచ్చినా.. అవి కూడా వర్కవుట్ కాలేదు. దీంతో ఇక సౌత్ కు తిరిగొచ్చేయాలని నిర్ణయం తీసుకుందీ భామ. కాని చాలా ఆలస్యంగా ఈ డెసిషన్ తీసుకుందని చెప్పాలి. సౌత్ లో ఇలియానా రీ ఎంట్రీ ఇస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా..? అనే అనుమానం నిర్మాతల్లో కలుగుతోంది. దీంతో తన పారితోషికాన్ని సగానికి తగ్గించి కేవలం యాభై లక్షలు మాత్రమే తీసుకుంటానని నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. మరి ఇలియానా ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి..!