అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం 'సరైనోడు'. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 1న ఈ సినిమా పాటలను నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. తమన్ అందించిన ఈ సినిమా మ్యూజిక్ పై మిశ్రమ స్పందన వస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందుగా వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ ను భారీగా ప్లాన్ చేశారు చిత్రబృందం. సుమారుగా కోటి రూపాయల ఖర్చుతో ఒక ఫైట్ ను కంపోజ్ చేసినట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలియజేశారు. అయితే కేవలం ఫైట్స్ కి మాత్రమే కాకుండా వైజాగ్ లో జరగబోయే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా మరో కోటి రూపాయలు ఖర్చుపెట్టనున్నారని సమాచారం. ఈ రేంజిలో బన్నీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకోబోతున్నాడు. ఏప్రిల్ 22 న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.