పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'సర్దార్ గబ్బర్ సింగ్' పై రోజుకో వార్త వస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ బాజ్ ఏర్పడింది. దానికి తోడు దేవిశ్రీ అందించిన బాణీలు దుమ్ము రేపుతుండడంతో సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ ఎలిమెంట్ బయటకు వచ్చింది. దీన్ని బట్టి ఈ సినిమాలో బ్రహ్మీ క్యారెక్టర్ హైలైట్ అవుతుందని తెలుస్తోంది. బ్రహ్మీ వెపన్స్ డీలర్ గా వెపన్ టైగర్ అనే పాత్రలో నటిస్తున్నాడు. వెపన్స్ ను సప్లై చేసే క్రమంలో తన కస్టమర్స్ ను ఎప్పుడూ.. ఇబ్బంది పెడుతుంటాడు బ్రహ్మీ. చివరకు పవన్ తో గట్టిగా దెబ్బలు తింటాడట. పవన్ కళ్యాణ్, బ్రహ్మానందంల మధ్య వచ్చే సీన్స్ సినిమాకు ప్లస్ అవుతాయని చిత్రబృందం భావిస్తోంది. ఈ మధ్య ఫ్లాపుల్లో ఉన్న బ్రహ్మీ ఈ సినిమాతో అయినా.. పూర్వ వైభవాన్ని పొందుతాడేమో.. చూడాలి..!