Advertisementt

‘సరైనోడు’ ఆ విషయంలో వీకయ్యాడు!

Sat 02nd Apr 2016 01:43 PM
sarrainodu,sardaar gabbar singh,sarrainodu album disappointed,sardaar gabbar singh song rocks  ‘సరైనోడు’ ఆ విషయంలో వీకయ్యాడు!
‘సరైనోడు’ ఆ విషయంలో వీకయ్యాడు!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్-బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సరైనోడు’. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఏప్రిల్ 1 న మార్కెట్లోకి విడుదలయ్యాయి. అయితే తమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటలు పెద్దగా ఆకట్టుకునే విధంగా లేవనే చెప్పాలి. అంతో ఇంతో బ్లాక్‌బస్టర్ సాంగ్ మినహా ఏ పాట ఆకట్టుకునే విధంగా లేదు. గతంలో బోయపాటి-దేవిశ్రీప్రసాద్ కలయికలో వచ్చిన భద్ర, తులసీ, లెజెండ్ చిత్రాలు మ్యూజికల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. అయితే ‘సరైనోడు’ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ పాటలు శ్రోతలను ఆకట్టుకుంటూ..యువతను ఉర్రూతలూగిస్తుంటే.. ‘సరైనోడు’ మాత్రం సంగీతపరంగా నిరాశనే మిగిల్చింది..సర్దార్ పాటల ముందు సరైనోడు సంగీతం తేలిపోయిందనే విమర్శలతో పాటు ‘సరైనోడు’ సంగీత పరంగా వీకయ్యాడు అనే టాక్ ఆల్‌రెడీ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ