పవన్ ఏది చేసినా సమ్ థింగ్ స్పెషల్ గా ఉండాలని భావిస్తారు. అందుకే 8 రోజుల ముందే 'సర్దార్..' సెన్సార్ జరిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలవుతున్న విషయం తెలిసిందే. 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్ర నిర్మాణం నత్తనడకన సాగినా, రిలీజ్ మాత్రం పక్కా ప్లానింగ్ తో జరుగుతోంది. నిజానికి పెద్ద సినిమాల సెన్సార్ హడావుడిగా ఉంటుంది. ఒకవైపు రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. మరోవైపు ఫస్ట్ కాపీ కోసం హైరాన పడుతుంటారు. 'సర్దార్...' మాత్రం వారం ముందుగానే ఇది పూర్తిచేశాడు. పాటలను మినహాయించి మిగతా సినిమాకు సెన్సార్ జరిపించినట్టు తెలిసింది. పాటలను మరోసారి సెన్సార్ చేయించే అవకాశం ఉంది. ఇకపోతే సర్దార్...చిత్రాన్ని 42 దేశాల్లో, బాలీవుడ్ లో 800 థియేటర్ల లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈరోస్ నిర్మాణ సహకారం అందిస్తోంది. భారీ ఎత్తున దేశ, విదేశాల్లో రిలీజ్ అయ్యే ఈ చిత్రం కోసం అంతటా థియేటర్లు, మల్టీ ఫ్లెక్స్ లు కన్ ఫర్మ్ కావాలి. ఎలాంటి కన్ ఫ్యూజన్ ఉండకూడదు. ఇదంతా జరగాలంటే సినిమా రిలీజ్ పై ఎలాంటి సందిగ్దత ఉండకూడదు. ఈ కారణం చేతనే 'సర్దార్...' సెన్సార్ కార్యక్రమాలను త్వరగా పూర్తిచేశారని సినీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తెలుగు సినిమా మార్కెట్ ను మరికొన్ని దేశాలకు విస్తరించే ప్రయత్నం చేస్తున్న పవన్ ను అభినందించాలి. ప్రతి పెద్ద హీరో సినిమా రిలీజ్ ను పక్కా ప్లానింగ్ తో చేస్తే బయ్యర్లకు టెన్షన్ ఉండదు.