టీవీలో ఏదైన ప్రోగ్రామ్ బాగా ఉండాలంటే ప్రజెంటర్ బాధ్యతే ఎక్కువ. వాళ్లే నీరసంగా ఉంటే చూసేవాళ్లకి ఆసక్తి ఉండదు. జీవిత నిర్వహిస్తున్న 'బతుకు జట్కాబండి' తీరు ఇలాగే ఉంది. భార్యాభర్తల సమస్యల పరిష్కారానికి దారిచూపే ఈ కార్యక్రమాన్ని గతంలో సుమలత నిర్వహించగా పాపులర్ అయింది. ఇప్పుడు జీవితకు అప్పజెప్పారు. సీనియర్ నటిగా ఆమెకు అపార అనుభవం ఉంది. అయితే ప్రజెంటర్ గా చాలా నీరసంగా, తానే సమస్యల్లో ఉన్నట్టు కనిపిస్తోందని చాలా కాలంగా కామెంట్స్ ఉన్నాయి. ఎదుటివారి జీవితాలను మాననీయ కోణంలో చూడాలి. విశ్లేషణ ఉండాలి, సరైన పరిష్కారం చూపగలగాలి. జీవితలో ఈ లక్షణాలు లేవని అందుకే రేటింగ్ పరంగా ఈ ప్రోగ్రామ్ పోటీ పడలేకపోతోందని అంటున్నారు. జీవిత భర్త డాక్టర్ రాజశేఖర్ సినిమాల్లేక ఖాళీగా ఉన్నారు. ఆయన ప్రవర్తన గురించి చిత్ర పరిశ్రమలో చాలామందికి తెలుసు. ప్రస్తుతానికి రాజశేఖర్ కు ఆదాయం లేదు. ఈ పరిస్థితి జీవితపై కనిపిస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు.