Advertisementt

బన్నీ సర్ప్రైజ్ కు ఫ్యాన్స్ హ్యాపీ!

Fri 01st Apr 2016 08:50 PM
allu arjun,sarainodu,boyapati srinu,sarainodu songs  బన్నీ సర్ప్రైజ్ కు ఫ్యాన్స్ హ్యాపీ!
బన్నీ సర్ప్రైజ్ కు ఫ్యాన్స్ హ్యాపీ!
Advertisement
Ads by CJ

తెలుగు సినిమాల్లో ఆడియో రిలీజ్ కార్యక్రమాలను చాలా గ్రాండ్ ఈవెంట్ గా ప్లాన్ చేస్తుంటారు. అదే స్టార్ హీరో సినిమా ఆడియో అంటే అదొక పండగలా చేస్తారు. వీటికి అతీతంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' సినిమా పాటలను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న స్టార్ హీరో సైతం తన సినిమా ప్రమోషన్ కోసం ఆడియో ఫంక్షన్లను నిర్వహిస్తుంటాడు. కాని అల్లు అర్జున్ మాత్రం ఆడియో వేడుక లేకుండా నేరుగా పాటలు విడుదల చేయాలనే నిర్ణయం తీసుకొని అందరినీ ఆశ్చర్య పరిచాడు. కొద్ది సేపటి క్రితమే లహరి మ్యూజిక్ లో సినిమా పాటలు అప్ లోడ్ అయ్యాయి. ఇప్పటికే టీజర్ లాగా బ్లాక్ బాస్టర్ అనే పాటను రిలీజ్ చేసారు. ఇప్పుడు ఆడియోతో పాటు ఈ బ్లాక్ బాస్టర్ అనే పాటను తాజాగా రెండు నిమిషాల నిడివి తో చూపించారు. సినిమాలో హైలైట్ గా నిలిచే ఈ పాటను విజువల్ గా ముందే రిలీజ్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ