వై.యస్. జగన్ తనకు తానే కండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ చేతులెత్తేసిందని తేల్చేశారు. సభ జరిగినన్ని రోజులు చంద్రబాబు చేసిన ప్రతి పనిలో తప్పులు వెతకడమే జగన్ కు సరిపోయిందని పార్టీ వర్గాలే అంటున్నాయి. వైకాపా నుండి పది మంచి ఎమ్మెల్యేలు టిడిపిలోకి జంప్ అయినప్పటికీ ఆయన వ్యవహార శైలిలో మార్పురాలేదు. డబ్బు లిచ్చి కొనుక్కున్నారని అన్నారు. తను పార్టీ పెట్టినపుపుడు కూడా ఎమ్మెల్యేలు చేరిన విషయం మరిచారు. ప్రతి దానికి మా డాడీ గొప్ప అని చెప్పే జగన్ ఫ్లాష్ బ్యాక్ మరిచారు. వై.యస్. ముఖ్యమంత్రిగా ఉన్నపుడు టిఆర్ ఎస్ నుండి ఆరుగురు ఎమ్మెల్యేలను ఆకర్షించారు. మరి వై.యస్. వారిని కొనుగోలు చేశారని ఆయన ఉద్దేశమా. చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేయడం లేదెందుకు. అక్కడ కూడా టిడిపి నుండి 12 మంది ఎమ్మెల్యేలు జంప్ అయిన విషయం జగన్ కు తెలియదనుకోవాలా. రెండు రాష్ట్రాల్లో వైకాపా ఉందికదా, పైగా రాజకీయ వ్యవహారాలను హైదరాబాద్ నుండే జరుపుతుంటారు.
రాజకీయమంటే కేవలం ప్రభుత్వాన్ని తప్పుపట్టడమే కాదు. ప్రతి దాంట్లో అవినీతిని చూడడమే కాదనే విషయాన్ని జగన్ గ్రహిస్తే మంచిది. తన మీడియా ద్వారా తెదేపాను అప్రతిష్టపాలు చేస్తే ప్రజలు వైకాపా వైపు మెుగ్గుతారా, మీడియా ఓటర్లను ప్రభావితం చేయలేదని గత ఎన్నికల్లో స్పష్టమైంది. కేవలం ఆరోపణలు చేస్తూ పోతే ప్రతిపక్ష నేత అభివృద్ది గురించి ఎప్పుడు ఆలోచిస్తారు. ఇప్పటికే పట్టుసీమను వ్యతిరేకించి రాయలసీమలో వ్యతిరేకత తెచ్చుకున్నారని పార్టీ ఎమ్మేల్యేలే అసంతృత్తితో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కోనసీమలో ఎక్కువ స్థానాలు గెలవాలనే ఆలోచన జగన్ లో కనిపిస్తోంది. కానీ ప్రతిపక్షనేత మెుత్తం రాష్ట్రం గురించి ఆలోచించాలి. మరో మూడేళ్ళ తర్వాత కానీ ఎన్నికలు రావు. ఇప్పుడు అధికారపార్టీపై చేస్తున్న ఆరోపణలు ఎన్నికల సంవత్సరంలో చేస్తే అవి ప్రజలపై ప్రభావం చూపించవచ్చు.