మీడియా పట్ల కొణదెల చిరంజీవి వ్యవహార శైలి మరోసారి వివాదస్పదమైంది. నటుడి నుండి రాజకీయ నాయకుడిగా మారినా తీరు మారలేదు. చిరు పాత్రల నుండి మెగాస్టార్ గా ఎదగడానికి మీడియా అందించిన సహకారం గురించి పదే పదే చెప్పే చిరంజీవి తన ఇంట శుభకార్యం జరిగినపుడు మాత్రం వారిని గేటు బయటే ఉండాలంటారు. ఆయన భజనపరులు అతిగా ప్రవర్తిస్తారు. జర్నలిస్టుల ముసుగులో కొందరు చిరంజీవికి ఊడిగం చేస్తున్నారనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. గురువారం హైదరాబాద్ లో శ్రీజ వివాహ రిసెప్షన్ జరిగింది. మీడియాకు ఆహ్వానం అందింది. కానీ రెడ్ కార్పేట్ వరకే కెమెరాలను అనుమతించారు. సెలబ్రిటీల ఫోటోలు తీసుకుంటూ బాధ్యతగా మీడియా ప్రజలకు అప్ డేట్స్ అందించింది. ఒకవైపు అవమానం జరుగుతున్నా వృత్తి ధర్మాన్ని మరిచిపోలేదు.
శ్రీజ మళ్లీ పెళ్లి గురించి అధికారికంగా ఎవరూ చెప్పనప్పటికీ ఇది ఆడపిల్ల వ్యవహారం కాబట్టి మీడియా గీతదాటే ప్రయత్నం చేయలేదు. పెళ్లికి ఆహ్వాన పత్రికలు పంపనప్పటికీ, రిసెప్షన్ కు పిలిచి లోనికి రానివ్వకుండా అడ్డుపడినప్పటికీ మీడియా సంయమనం పాటించింది. చివరికి ఆహారపొట్లాలను వరద బాధితులకు పంచినట్టు పంచారు. ఈ కార్యక్రమానికి నలుగురు సమన్వయ కర్తలను పెట్టుకున్నా వారి అవగాహనా రాహిత్యం కనిపించింది.
ఓడ మల్లన్న, బోడి మల్లన్న సామెతలా చిరంజీవి వ్యవహారం ఉంది. నటుడిగా మీడియా తోడ్పాటు తీసుకుని, రాజకీయ నేతగా కొత్త పాత్ర పోషించే సందర్భంలో సినీ మీడియాను పక్కన పెట్టేశారు. తరచుగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడం టాలీవుడ్ లో చిరుతోనే జరుగుతున్నాయి. ఆయన మీద మీడియాకు గౌరవం ఉన్నా.. దాన్ని నిలుపుకోవడంలో విఫలమయ్యారు. పక్కన చేరిన భజనపరుల వ్యవహారం చిరంజీవి దృష్టికి వెళ్ళడం లేదనుకోవాలా, లేక తెలిసి మౌనంగా ఉన్నారని భావించాలా?
రిసెప్షన్ లో ఇంతగా అవమానించి మళ్లీ తీరిగ్గా ఫోటోలు మెయిల్స్ ద్వాారా పంపించారు. అంటే మాకు ప్రచారం కావాలి. మీడియా మాత్రం వద్దు అనే తరహాలో చిరు కుటుంబం ఉన్నట్టుగా కనిపిస్తోంది. రాజకీయ నేతగా పూర్తి వైఫల్యం చెంది, పార్టీని నమ్మి వచ్చిన లక్షలాది అభిమానులను మోసం చేసి, స్వార్ధం చూసుకున్నప్పుడు కూడా మీడియా ఆయన గౌరవాన్ని కాపాడింది. షష్టి పూర్తి సందర్భంలో కూడా ఇలాగే ప్రవర్తించిన సంయమనంగా ఉంది. తరుచుగా ఇది రిపీట్ కావడం చిత్రంగా కనిపిస్తోంది. చిరంజీవి పట్టు రోజు రోజుకు జారిపోతోంది. కుటుంబంలో కానీ, స్టాఫ్ పట్ల కానీ ఆయన మాట చెల్లుబాటు కావడం లేదా అనే అనుమానం సన్నిహిత వర్గాల్లోనే కలుగుతోంది. బావమరిది అల్లు అరవింద్ పర్యవేక్షణ నుండి తప్పుకున్నారా, చిరు డైరెక్షన్ లో కార్యక్రమాలు జరగడమే దీనికి కారణమా అని ఆ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇంట జరిగిన శుభకార్యక్రమానికి పవన్ కల్యాణ్ డుమ్మా కొట్టాడు. తమ బంధం అన్నవరకే అని పవన్ పరోక్షంగా సంకేతాలు పంపినట్టు కనిపిస్తోంది.