తను మరొకరితో పోల్చడం అనుష్క కు అసలు ఇష్టం ఉండదట. తన కెరీర్ ఆరంభించినప్పుడు అందరూ.. అనుష్కను బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తో పోల్చేవారట. మొదట్లో అనుష్క సంతోషపడినా.. వాస్తవంగా ఆలోచిస్తే అది నిజం కాదని.. కరీనాకు తను ఏ విషయంలోనూ పోలికలే లేవని చెబుతోంది ఈ అమ్మడు. నేను నేనుగా ఉండలనుకుంటానని.. మరొకరితో పోలిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పుకొచ్చింది అనుష్క. అంతేకాదు ఏ నటిని మరొక నటితో పోల్చకూడదని.. ఎవరి ప్రతిభ వాల్లదని చెప్పింది. బాలీవుడ్ హీరోయిన్స్ కు, సౌత్ హీరోయిన్స్ కు చాలా వ్యత్యాసం ఉంటుందట. ఒకరినుండి మరొకరు స్ఫూర్తి పొందుతారే కానీ పలానా హీరోయినా లా నటించాలనుకోరని యోగా బ్యూటీ తెలిపింది. ప్రస్తుతం అనుష్క 'బాహుబలి 2','సింగం 3' చిత్రాల్లో నటిస్తోంది.