Advertisementt

చరణ్, నాగ్ తో నటించనని చెప్పాడు!

Fri 01st Apr 2016 02:12 PM
ram charan,nagarjuna,thani oruvan,oopiri  చరణ్, నాగ్ తో నటించనని చెప్పాడు!
చరణ్, నాగ్ తో నటించనని చెప్పాడు!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం నాగార్జున వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయాడు. ఎలాంటి ఈగో లేకుండా యువ హీరోలతో కూడా కలిసి నటిస్తున్నాడు. తన పాత్ర కోసం కాకుండా కథను నమ్మి సినిమాలు చేస్తున్నాడు. 'మనం','సోగ్గాడే చిన్ని నాయనా','ఊపిరి' చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు. ఇది ఇలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'తని ఒరువన్' సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఓ స్టార్ డైరెక్టర్ చరణ్ తో మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేశాడు. చరణ్ తో పాటు మరో హీరో పాత్రలో నాగార్జున ను అనుకున్నారట. అయితే కథ విన్న చరణ్ పాత్రల విషయంలో క్లారిటీ లేదని, అయినా ప్రస్తుతం తనకు మల్టీ స్టారర్ సినిమాలో నటించే ఆలోచన లేదని చెప్పేశాడట. దీంతో ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ