ఇటివలే జాతీయ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గాను ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నాడు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. అవార్డుల వేడుకలో ఈయనగారు చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేస్తున్నాయి? అసలు విషయం ఏమిటంటే .. ఈ అవార్డులలో ఉత్తమ నటిగా కంగనా రనౌత్ ఎంపికయింది. ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్న సమయంలో బన్సాలి మాట్లాడుతూ ఉత్తమ నటిగా 'బాజీరావు మస్తానీ' సినిమాకు గాను దీపికకు రావాల్సింది, లేదా ప్రియాంకా కైనా రావాలి, కాని జూరీ సెలక్షన్ కదా ! అంటూ కామెంట్ చేసాడు. అంతే. అసలు విషయం ఇప్పుడే మొదలైంది. కంగనా వారికంటే ఉత్తమ నటి కాదనే ఫీలింగ్ ను తెలిపాడు సంజయ్. అసలే దీపిక కు .. కంగనా కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. అలాంటిది ఈయన ఇలా కామెంట్ చేయడంతో అసలే ఫైర్ బ్రాండ్ అయిన కంగనా ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో అని షాక్ అయి చూస్తున్నారు జనాలు. మరి కంగనా రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి !?