కొరటాల శివ... ఆయన ఇప్పటివరకు రెండు సినిమాలు తీశాడు. ఈ రెండు చిత్రాలోనూ ప్రభాస్, మహేష్‌బాబులను డిఫరెంట్ స్లైల్‌లో చూపించాడు. ముఖ్యంగా హీరో లుక్, యాటిట్యూడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని వారిని తెరపై అధ్బుతంగా చూపించాడు. మిర్చి, శ్రీమంతుడు తర్వాత ప్రస్తుతం మైత్రీ మూవీస్ బేనర్‌లో యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌తో 'జనతాగ్యారేజ్' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ స్పాట్‌లోని ఓ ఫొటో విడుదలైంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతోంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పోరాట సన్నివేశాలను ఇటీవల ముంబైలో ఎన్టీఆర్‌పై చిత్రీకరించారు. ఆ ఫోటో కూడా ఒకటి రివీల్ అయింది. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే తన కెరీర్ ప్రారంభం నుండి ఒకే విధంగా కనిపిస్తూ, సేమ్ డైలాగ్ డెలివరీతో ఆయన కొంత అపఖ్యాతి తెచ్చుకున్నాడు. కానీ 'టెంపర్' చిత్రంతో తన బాడీ లాంగ్వేజ్‌ను, డైలాగ్ డెలివరీని మార్చుకొని ఆ చిత్రంతో అందరినీ కట్టిపడేశాడు. తాజాగా సంక్రాంతికి వచ్చిన 'నాన్నకు ప్రేమతో'లో కూడా సపరేట్ లుక్, స్టైల్, డైలాగ్ డెలివరితో ఆకట్టుకున్నాడు. రాబోయే 'జనతాగ్యారేజ్'లో కూడా ఆయన కొరటాల నేతృత్వంలో డిఫరెంట్ లుక్‌తో కనిపిస్తుండటంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు.