Advertisementt

మహేష్ సినిమాలో తమిళ స్టార్ హీరో!

Fri 01st Apr 2016 09:20 AM
mahesh babu,vijay,murugadoss,brahmothsawam  మహేష్ సినిమాలో తమిళ స్టార్ హీరో!
మహేష్ సినిమాలో తమిళ స్టార్ హీరో!
Advertisement
Ads by CJ

మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకక్కనుందనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉండాలని దర్శకుడు ఇప్పటినుండే కసరత్తులు మొదలెట్టాడు. 'శ్రీమంతుడు' సినిమాతో మహేష్ క్రేజ్ మరింత పెరిగింది. 'బ్రహ్మోత్సవం' సినిమా రిలీజ్ అయిన తరువాత మహేష్ పై హైప్ ఇంకాస్త పెరుగుతుంది. ఈ విషయాలను మైండ్ లో పెట్టుకున్న మురుగదాస్ ప్రేక్షకుల అంచనాలకు ధీటుగా తన సినిమాను రూపొందించబోతున్నాడు. ఇందులో భాగంలో తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ను మహేష్ సినిమాలో నటించమని అడిగారట. విజయ్ కూడా మహేష్ సినిమాలో కనిపించడానికి ఒప్పుకున్నాడట. అయితే సినిమాలో విజయ్ రోల్ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం. తమిళంలో విజయ్ కు మంచి క్రేజ్ ఉండడంతో ఈ సినిమా బిజినెస్ తెలుగుతో పాటు తమిళంలో కూడా భారీగా అవుతుందని భావిస్తున్నారు..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ