Advertisementt

సూర్య బాలీవుడ్ కి వెళ్తున్నాడు..!

Thu 31st Mar 2016 06:15 PM
surya,24 movie,vikram k kumar,samantha,nithyamenon  సూర్య బాలీవుడ్ కి వెళ్తున్నాడు..!
సూర్య బాలీవుడ్ కి వెళ్తున్నాడు..!
Advertisement
Ads by CJ

తమిళ స్టార్ హీరో సూర్య, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో '24' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలయిన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా రీమేక్ చేయాలని భావిస్తున్నారు. అయితే సూర్య నే సొంతంగా తన బ్యానర్ పై ఈ చిత్రాన్ని హిందీలో చేయాలనుకోవడం విశేషం. ఈ సినిమాలో హీరోగా హృతిక్ రోషన్ లేదా సల్మాన్ ఖాన్ లను సంప్రదించాలనే ఆలోచనలో సూర్య ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సూర్య మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. సూర్య కు జంటగా సమంత, నిత్యా మీనన్ లు నటిస్తున్నారు. సమ్మర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ