నాగార్జున-కార్తీల కాంబినేషన్‌లో వచ్చిన 'ఊపిరి' చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటోంది. కాగా ఈచిత్రంలో మొదట కార్తీ పాత్రను ఎన్టీఆర్‌ను అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ ఆ పాత్రను చేయనన్నాడు.ఆ నిర్ణయం ఎన్టీఆర్‌కే కాదు... పివిపి నిర్మాణ సంస్థకు కూడా చేటునే చేసింది. ఈచిత్రం చూస్తున్నంతసేపు కార్తీ పాత్రలో ఎన్టీఆర్‌ను ఊహించుకోని ప్రేక్షకుడు లేరంటే అతిశయోక్తి కాదు. కాగా ఈచిత్రాన్ని కేవలం బాలయ్యను దృష్టిలో పెట్టుకొని నాగ్‌తో చేయడానికి ఎన్టీఆర్ నిరాకరించాడని గతంలో వార్తలు వచ్చాయి. బాలయ్యకు, నాగ్‌కు మధ్య ఉన్న వైరం కారణంగా ఈ చిత్రంలో నాగ్‌తో కలిసి చేస్తే బాబాయ్ కోపడతాడని, తమ మధ్య మరింత గ్యాప్ వచ్చే అవకాశం ఉందని ఎన్టీఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కానీ బాలయ్యతో అయినా సఖ్యతగా ఉన్నాడా ?అంటే అదీ లేదు. సంక్రాంతికి పోటీపడి మరీ బాబాయ్, అబ్బాయ్‌లు తమ చిత్రాలను పోటాపోటీగా విడుదల చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించకపోవడానికి మరో సీన్ కూడా కారణం అంటున్నారు. ఈ చిత్రంలో ఓ సీన్‌లో నాగ్ కాళ్లకు.. కార్తి సాక్స్‌లు తొడగాల్సిన సీన్ ఉంది. ఇలాంటివే మరి రెండు మూడు సీన్లు ఉండటంతో ఇలాంటి సీన్స్ ఉన్న చిత్రంలో నటిస్తే తన అభిమానులు తట్టుకోలేరని ఎన్టీఆర్ భావించి రిజెక్ట్ చేశాడని అంటున్నారు. అదే ఈచిత్రంలో ఎన్టీఆర్ నటించి ఉంటే నాగ్- ఎన్టీఆర్‌లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగులో కలెక్షన్లు అదరగొట్టి రికార్డులు బ్రేక్ చేసేదని అందరూ ఒప్పుకుంటున్నారు. ఈ చిత్రంలో కార్తీ బాగా నటించినప్పటికీ ఆయనకు తెలుగులో పెద్దగా క్రేజ్ లేకపోవడం, తమిళంలో కూడా ఆయన స్టామినా అంతంత మాత్రమే కావడంతో నిర్మాతలకు ఎదురుదెబ్బే తగిలిందని కొందరు విశ్లేషిస్తున్నారు.