ఆనాటి కాలంలో కీర్తిశేషులు నందమూరి తారకరామారావు గారు షూటింగ్ స్పాటులో ఉన్నారంటే ఆయన చెప్పిందే వేదంగా అక్కడి వాతావరణాన్ని ఏర్పరుచుకునేవారు. పాటల షూటింగు సమయంలో అయితే డ్యాన్స్ మాస్టార్లకు చుక్కలే. అందుకే ఆయన చేసిందే డ్యాన్సు, వేసిందే స్టెప్పు అని ఊరుకునేవారు. అప్పటికీ అన్ని సినిమాలలోను ఎన్టీయార్ నటవిశ్వరూపమే మనకు అగుపించేది. సరిగ్గా పవన్ కళ్యాణ్ కూడా ఆ దారిలోనే పయనిస్తున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి వస్తున్న సమాచారాన్ని వింటుంటే పవన్ ఎంతటి మొనార్కో అనిపిస్తోంది. సరిగ్గా అయిదు లేదా ఆరు రోజుల్లో రెండు పాటలను స్విట్జర్లాండ్ దేశంలో షూటింగ్ చేసుకొస్తామని బయలదేరిన సర్దార్ టీం మొత్తాన్ని పవన్ కళ్యాణ్ ఒక్కడే లీడ్ చేస్తున్నాడు. కొరియోగ్రఫీలో కూడా పవన్ నిష్ణాతుడే కావడంతో అసలు డ్యాన్స్ మాస్టర్ దినేషుకు పెద్దగా పని లేకుండా పోయిందట. పవన్ వేసి చూపిస్తున్న డ్యాన్సు మూమెంట్లను సైడ్ డ్యాన్సర్ల చేత, హీరోయిన్ చేత సరిగా చేయించడమే ఆయన పనిగా మారిందట. ఆరు రోజుల్లో రెండు పాటలు అన్న స్కీముకు తగ్గట్లుగా చకచాకా పనులు కావాలంటే పవన్ పెట్టిందే నృత్య భంగిమ అని ఒప్పుకోక తప్పదు మరి! స్టార్ హీరోలా మజాకా...!