Advertisementt

భారం దిగింది, బాధ్యత పెరిగింది!

Thu 31st Mar 2016 04:02 PM
chiranjeevi,srija marriage,chiru 150th film  భారం దిగింది, బాధ్యత పెరిగింది!
భారం దిగింది, బాధ్యత పెరిగింది!
Advertisement
Ads by CJ

పర్సనల్ జీవితం, ప్రొఫెషనల్ జీవితం రెండు వేరువేరుగా చూడాలని భారీ మాటలు ముక్తసరిగా మాట్లాడినా, రెండూ అన్యోన్యంగా ముడిపడి ఉంటాయని మెగాస్టారుగా ఎదిగిన చిరంజీవిగారిని చూస్తే ఇట్టే తెలుస్తోంది. చాన్నాళ్ళుగా తన 150వ సినిమాను వాయిదా వేసుకుంటూ వస్తున్న చిరంజీవి గారు కథలను నచ్చకో, దర్శకులను మెచ్చకో వేచి చూస్తున్నారు అనుకున్నాం గానీ నెత్తి మీద కుంపటి లాంటి భారాన్ని మోస్తున్నారని ఈరోజే తెలిసింది. అవును కూతురు శ్రీజ వైవాహిక జీవితంలోని ఒడిదొడుకులే తండ్రిగా చిరుని మానసికంగా కృంగదీసాయని అంటున్నారు సన్నిహితులు. మొన్న సోమవారం బంధువుల, స్నేహితుల, శ్రేయోభిలాషుల సమక్షంలో శ్రీజ రెండో వివాహం కళ్యాణ్ అనే కుర్రాడితో బెంగుళూరులో అంగరంగ వైభవంగా జరగడం చిరంజీవి జీవితంలోనే మరుపురాని ఘట్టం కింద అభివర్ణిస్తున్నారు. చిరంజీవి గారికి ముందు నుండీ చిన్న కూతురు శ్రీజ అంటే కాస్తంత ఎక్కువ ప్రేమ. అందుకే శ్రీజ చేసిన మహాపరాధాలను కూడా మన్నించి తండ్రిగా పూర్తి బాధ్యతను నెరవేర్చాడు. శ్రీజ తనకు మెచ్చిన ఓ ఇంటికి కోడలైంది అన్న శుభవార్తతో మెగాస్టార్ భారం పూర్తిగా దిగిపోయింది. అందుకే తానిక పూర్తిగా 150వ సినిమాకి అంకితం అయిపోవచ్చు అని దగ్గరి వారితో చెప్పుకొని సంతోష పడిపోయారట. తండ్రిగా భారం దిగినా, అభిమానులను అలరింపజేయల్సిన మెగాస్టారుగా మీ బాధ్యత ఇంకా మిగిలే ఉంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ