Advertisementt

TSలో టిడిపి- APలో వైసిపి 'సేమ్ టు సేమ్'!

Wed 30th Mar 2016 08:23 PM
jyothula nehru,errabelli dayakar rao,tdp,ysrcp,andhra pradesh,telangana  TSలో టిడిపి- APలో వైసిపి 'సేమ్ టు సేమ్'!
TSలో టిడిపి- APలో వైసిపి 'సేమ్ టు సేమ్'!
Advertisement
Ads by CJ

గెలిచిన పార్టీ నుండి అధికారంలో ఉన్న పార్టీలో చేరే ట్రెండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఈ జంప్ జిలానీలను చూసి ప్రజలు ఏమనుకుంటున్నారనేది వేరే విషయం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆకర్ష్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలో టిడిపి దాదాపుగా ఖాళీ అయింది. ఆం.ప్ర.లో వైకాపా నుండి పదిమంది టిడిపీలోకి జంప్ అయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా గోడదూకే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణ స్టేట్ లో టిడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఆకర్షిస్తున్నారని పలుమార్లు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేపై స్పీకర్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా హైకోర్టులో కూడా కేసు వేశారు. అలాంటి ఆయన కూడా ఓవర్ నైట్ టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. సరిగ్గా ఈ సీనే ఆం.ప్ర.లో కూడా కనిపించింది. వైకాపా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ మంగళవారం ఆ పార్టీకి రాం రాం చెప్పేశారు. జ్యోతుల అంతకు ముందు చంద్రబాబు ఆకర్ష్ పై  పలు చోట్లు విరుచుపడ్డవారే. ఈ విషయంపై పలుమార్లు అసెంబ్లీలో  దులిపేశారు. అలాంటి జ్యోతుల అకస్మాత్తుగా పార్టీ వీడి.. చంద్రబాబు పంచన చేరడం వై.యస్. జగన్ కు షాక్ ఇచ్చింది. రాజకీయాల్లో ఇవి సహజమే అయినప్పటికీ, నమ్మకంగా ఉన్నవారే పార్టీలు మారడం మాత్రం చిత్రంగా కనిపిస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ