Advertisementt

అనసూయ రేంజ్ బాగా పెరిగింది!

Wed 30th Mar 2016 07:52 PM
anasuya,audi q7 car,soggade chinni nayana,kshanam  అనసూయ రేంజ్ బాగా పెరిగింది!
అనసూయ రేంజ్ బాగా పెరిగింది!
Advertisement
Ads by CJ

యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి 'జబర్దస్త్' షో తో మంచి ఫేం సంపాదించుకుంది అనసూయ. రీసెంట్ గా తనకు సినిమా ఆఫర్లు రావడం కూడా మొదలుపెట్టాయి. అనసూయ నటించిన 'సోగ్గాడే చిన్ని నాయన','క్షణం' సినిమాలు భారీ హిట్స్ గా నిలిచాయి. దీంతో అనసూయ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. టీవీ రంగంలోనూ, సినిమా రంగంలోనూ దూసుకుపోతున్న అనసూయకు సంపాదన కూడా బాగా పెరిగింది. అయితే అనసూయ సుమారుగా కోటి రూపాయల విలువ గల 'ఆడి క్యూ 7' కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఇప్పటివరకు స్టార్ హీరోలైన పవన్ కళ్యాన్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్ ల వద్ద మాత్రమే ఇలాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. వాళ్ళతో సరితూగేలా.. అనసూయ ఇప్పుడు కార్ కొనడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అనసూయ పివిపి బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ