Advertisementt

బన్నీ లుక్ కాస్త ధనుష్ లా అనిపిస్తోందే!

Wed 30th Mar 2016 07:52 PM
allu arjun,sarainodu,new look,dhanush,maari  బన్నీ లుక్ కాస్త ధనుష్ లా అనిపిస్తోందే!
బన్నీ లుక్ కాస్త ధనుష్ లా అనిపిస్తోందే!
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ ప్రతి సినిమాలో తన లుక్ విషయంలో గానీ, కాస్ట్యూమ్స్ విషయంలో గానీ కొత్తదనాన్ని పరిచయం చేస్తుంటాడు. అందుకే తనకు స్టైలిష్ స్టార్ అనే పేరు వచ్చింది. బన్నీ తన సినిమాల్లో ఎలా కనిపిస్తాడో.. ఎలాంటి స్టైల్ ను పరిచయం చేస్తాడో అని యూత్ అందరూ ఎదురుచూస్తుంటారు. దానికి తగ్గట్లే బన్నీ కూడా కొత్తగా కనిపించాలని ప్రయత్నిస్తుంటాడు. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన 'సరైనోడు' సినిమాలో తన కొత్త లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ చూసిన వారందరూ.. బన్నీ అదరగొట్టేసాడని పొగుడుతున్నారు. మీసం పెంచి, కొత్త హెయిర్ స్టైల్ తో దర్శనమిచ్చాడు స్టైలిష్ స్టార్. అయితే ఈ లుక్ చూసిన కొందరు తమిళంలో ధనుష్ హీరోగా నటించిన 'మారి' సినిమాలో లుక్ లా అనిపిస్తుందని మాట్లాడుకుంటున్నారు. 'మారి'లో ధనుష్ సినిమా మొత్తం అదే లుక్ తో కనిపిస్తాడు. 'సరైనోడు'లో కూడా బన్నీ లుక్ కాస్త అలానే అనిపిస్తోంది. అయితే బన్నీ ఒక పాట కోసం మాత్రమే ఈ లుక్ ట్రై చేశాడని సమాచారం!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ