పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా రిలీజ్ కు ముందే సంచలనాలను క్రియేట్ చేసింది. సినిమా ప్రీ రిలీజ్ బిజెనెస్ సుమారుగా 100 కోట్లకు పైగా జరిగింది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే మెగా హీరోలకు ఖాకీ డ్రెస్ బాలీవుడ్ లో అచ్చి రాలేదని పవన్ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని ఇప్పటికే ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే 'సర్దార్' సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేయడం వలన సినిమాకు నెగెటివ్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ మ్యూజిక్ వలన సినిమా రిజల్ట్ సరిగ్గా రాకపోవడమేంటని ఆలోచిస్తున్నారా..? అసలు విషయంలోకి వస్తే అల్లు అర్జున్ నటించిన 'ఆర్య' సినిమాకు దేవి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. దానికి సీక్వెల్ గా చేసిన 'ఆర్య 2' కి కూడా దేవినే మ్యూజిక్ చేశాడు. కాని ఆ సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేదు. అలానే మెగాస్టార్ చిరు నటించిన 'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్' సినిమాకు మ్యూజిక్ చేసిన దేవి దానికి సీక్వెల్ గా వచ్చిన 'శంకర్ దాదా జిందాబాద్' కు కూడా మ్యూజిక్ అందించాడు. మొదటి భాగం ఆడినంతగా రెండో సినిమా ఆడలేదు. అదే సెంటిమెంట్ పవన్ విషయంలో రిపీట్ అవుతుందేమో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 'గబ్బర్ సింగ్' సినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. 'సర్దార్' కు కూడా మంచి బాణీలను అందించాడు. మరి పవన్ విషయంలో ఈ సెంటిమెంట్ రిపీట్ కాకూడదనే ఆశిద్దాం..!