చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఒకప్పుడు స్టార్ హీరోలలో ముందుగా వినిపించే పేర్లు ఇవే. వీరి నలుగురిలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అయితే భక్తిరస చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించే హీరోల జాబితాలో ముందుగా నాగార్జున ఉంటాడు. తన కెరీర్ లో ''అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడిసాయి'' వంటి భక్తిరస చిత్రాల్లో నటించాడు. 'అన్నమయ్య, శ్రీరామదాసు' చిత్రాల్లో ఒక భక్తినిగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. తన కెరీర్ లో మైలు రాయిగా నిలిచిన చిత్రాలని నాగార్జున ఇప్పటికి ఆ చిత్రాలను తలుచుకుంటుంటారు. అలాంటి 'శ్రీరామదాసు' సినిమా రిలీజ్ అయ్యి ఈరోజుకి సరిగ్గా పదేళ్ళు అయింది. 2006 మార్చి 30 న 'శ్రీరామదాసు' సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కీరవాణి మ్యూజిక్ గురించి. తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు తన తండ్రి కూడా కలిసి నటించడం విశేషం. తన కెరీర్ లో ఇలాంటి మరిచిపోలేని హిట్స్ ఇచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావు తో నాగార్జున మరో భక్తిరస సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.