Advertisementt

తప్పు తెలుసుకున్న విష్ణు..!

Tue 29th Mar 2016 07:24 PM
eedo rakam aado rakam,manchu vishnu,raj tarun  తప్పు తెలుసుకున్న విష్ణు..!
తప్పు తెలుసుకున్న విష్ణు..!
Advertisement
Ads by CJ

మంచు విష్ణు ఇండస్ట్రీకి వచ్చి పుష్కరకాలం అయింది. అయితే ఆయన కెరీర్‌లో ఉన్నవి మూడే మూడు హిట్స్‌. ప్రారంభంలో మాస్‌ అండ్‌ యాక్షన్‌ హీరోగా చేయాలని భావించినప్పటికీ అవేమీ వర్కౌట్‌ కాలేదు. ఇక ఆయన ఆవైపు నుండి పక్కకు వచ్చి కామెడీ ఎంటర్‌టైనర్స్‌గా చేసిన 'ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా' చిత్రాలు చేశాడు. ఈ చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. కానీ ఆయన మరలా రూట్‌ మార్చి వర్మ దర్శకత్వంలో 'రౌడీ, అనుక్షణం' వంటి చిత్రాలు చేశాడు. ఇవేమీ ఆయనకు కలిసిరాలేదు. ఆ తర్వాత వచ్చిన 'డైనమైట్‌' కూడా ఆయనకు డిజాస్టర్‌నే మిగిల్చింది. వాస్తవానికి తప్పు చేయడం కామన్‌. సినిమాలన్నీ హిట్‌ కావాలని కూడా లేదు. 

కానీ చేసిన తప్పును తెలుసుకొని, పొరపాట్లు రిపీట్‌ కాకుండా చూసుకోవడం కనీస కర్తవ్యం. కాగా ఇప్పుడు విష్ణు తన తప్పును తెలుసుకొని మరలా కామెడీ ఎంటర్‌టైనర్‌కే ఓటేసాడు. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఆయన రాజ్‌తరుణ్‌తో కలిసి'ఈడో రకం.. ఆడో రకం' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మరలా విష్ణు తన పాత రూట్‌లోకి వచ్చాడు. తనకు అచ్చివచ్చిన కామెడీనే నమ్ముకోవడంతో ఈచిత్రంపై ఆయన భారీ ఆశలే పెట్టుకుని ఉన్నాడు. మరి ఈచిత్రం విష్ణుకు, రాజ్‌తరుణ్‌లకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ