2015 సంవత్సరానికి గానూ 63 జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డుల లిస్టులో మన తెలుగు చిత్రాలు బాహుబలి, కంచె చోటు సంపాదించుకున్నాయి. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. తెలుగు సినిమా సాంకేతికంగా ఎంతగా ఎదిగిందో.. బాహుబలి సినిమా నిరూపించింది. వీరి కష్టాన్ని గుర్తించిన జాతీయ అవార్డుల కమిటీ జ్యూరీ నేషనల్ అవార్డుతో బాహుబలిని సత్కరించింది. అలానే దర్శకుడు క్రిష్ రెండో ప్రపంచ నేపధ్యంలో తీర్చిదిద్దిన 'కంచె' సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు అందుకోబోతుంది. ఈ విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, హీరోలు.. రాజమౌళి, క్రిష్ లను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.