కులాల, మతాల పట్టింపుకు వీలైనంత దూరంగా ఉండే జగపతిబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు మాట్లాడుతూ... నాకు కులం, ప్రాంత భేదాలు లేవు. అదే ఉంటే 'జై బోలో తెలంగాణ' సినిమాలో నటించే వాడినే కాదు. కులాలు లేని సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. ఒక కులాన్ని బీసీలో చేర్చాలని, ఇంకో కులాన్ని ఎస్సీ లేదా ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్లు చూస్తే ఆ డిమాండ్‌లు రాజకీయపరమైనవిగా నేను భావిస్తాను. నేను కమ్మకులంలో పుట్టాను. కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు. ఏ కులంలో పుట్టినా ఇవే మాటలంటాను. కమ్మవాడిగా పుట్టినంత మాత్రాన నా గొప్పేమీ ఉండదు. మిగతా అందరిలాగే నేను కమ్మకులంలో పుట్టాను. అలాంటప్పుడు వాళ్ల గొప్పదనం, ప్రత్యేకత ఏముంది? అని ప్రశ్నించారు జగపతిబాబు.