Advertisementt

లారెన్స్‌ ఆ ఒక్కటి కూడా పూర్తిచేశాడు!

Sun 27th Mar 2016 06:48 PM
radhava lawrence,metta shiva ketta shiva,patas remake,lawrence  లారెన్స్‌ ఆ ఒక్కటి కూడా పూర్తిచేశాడు!
లారెన్స్‌ ఆ ఒక్కటి కూడా పూర్తిచేశాడు!
Advertisement
Ads by CJ

సినీ ఇండస్ట్రీలో ఆల్‌రౌండర్‌గా పిలిపించుకునే వారిలో లారెన్స్‌ కూడా ఒకరు. గ్రూప్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన లారెన్స్‌.. ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, దర్శకునిగా, నిర్మాతగా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పలు రంగాల్లో సక్సెస్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా లారెన్స్‌ ఓ పాటను కూడా పాడి,మరో రికార్డు నెలకొల్పాడు. 'పటాస్‌' సినిమా తమిళ రీమేక్‌లో లారెన్స్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక మాస్‌ సాంగ్‌ను లారెన్స్‌ పాడాడు. ఈ సాంగ్‌లో ఆయన స్టెప్పులు కూడా ఇరగదీశాడని సమాచారం. ఆ స్టెప్పులకు, బాణీకి తగ్గట్లుగా పాట కూడా మాంచి సౌండ్‌తో ఊపు మీద ఉండాలని ఆ బాధ్యత కూడా లారెన్సే తీసుకున్నాడట. మామూలుగా మాస్‌ సాంగ్‌లకు ఓ రేంజ్‌లో స్టెప్ప్‌లు వేసే లారెన్స్‌ ఈ సాంగ్‌లో ఎంతగా రెచ్చిపోతాడో చూడాలంటే కొద్దిరోజులు ఆగాలి.  ఈ చిత్రంలో లారెన్స్‌ హీరోయిన్‌గా నిక్కీగల్రాని నటిస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ