తెలుగు పరిశ్రమలో ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న విలక్షణ నటుడు, నిన్నటితరం కామెడీ హీరో రాజేంద్రప్రసాద్. సపోర్టింగ్ రోల్స్ నుంచి హీరో స్థాయికి ఎదిగి కాలంతోపాటు మారుతూ ప్రస్తుత జనరేషన్‌లో కూడా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఇకపై నెగటివ్ రోల్స్‌లోనూ మెప్పించనున్నారని సమాచారం. రాజేంద్రప్రసాద్ ఈ సంవత్సరం కొన్ని నెగటివ్ రోల్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఓ టాప్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్‌ను కలిసి స్క్రిప్ట్ చెప్పాడని, ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత రాజేంద్రప్రసాద్ సైతం ఆ కథలోని నెగటివ్ పాత్రను చేయడానికి ఒప్పుకున్నాడని సమాచారం. ఈమేరకు త్వరలోనే ఆయన అఫీషియల్‌గా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయనున్నాడట. ఇప్పటివరకు దాదాపు అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించిన రాజేంద్రప్రసాద్ ఇకపై నెగటివ్ రోల్స్ కూడా చేయనుండటం ఆసక్తికరమైన విషయమే.