పవన్‌కళ్యాణ్ ఏది చేసినా చాలా సింపుల్‌గా, ట్రెండింగ్‌గా ఉంటుంది అనడానికి 'సర్దార్ గబ్బర్‌సింగ్' సెట్స్‌లో ఆయన ప్రవర్తించిన తీరే నిదర్శనం. సాధారణంగా టాప్ హీరోలు సెట్‌కి వెళితే.. షాట్ అయిపోయిన వెంటనే తమ పర్సనల్ కారవాన్‌లో రెస్ట్ తీసుకొంటుంటారు. కానీ పవన్ 'సర్దార్' షూటింగ్ సమయంలో ఆ పనులన్నీ ఓ సాదాసీదా సెలూన్‌లో గడిపేవాడట. ఈ చిత్రం కోసం పవన్ స్వయంగా దగ్గరుండి వేయించిన రతన్‌పూర్ సెట్‌లో గోవిందరామ్ పేరుతో సెలూన్ షాప్ ను కూడా వేయించాడు, తన సీన్ అయిపోయిన వెంటనే పవన్ నేరుగా అందులోకి వెళ్లి తర్వాత చేయవలసిన షూటింగ్ తాలూకు చర్చలు ఆ సెలూన్ సెట్‌లోనే జరిపేవాడట. డైరెక్టర్, నిర్మాత, ఇతర ఆర్టిస్టులు ఎవరితోనైనా సరే అక్కడే కూర్చొని సినిమా విషయాలను, ఇతర విషయాలను మాట్లాడేవాడట. ఒక్కోసారి అక్కడే మేకప్‌తో పాటు ఇతర పనులన్నీ చూసుకొని నేరుగా షూటింగ్ స్పాట్‌కి వెళ్లేవాడని సమాచారం. మొత్తానికి సింప్లిసిటీకి పవన్‌ను నిలువెత్తు సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.