Advertisementt

ఊపిరి, అఖిల్ గురించి వినాయక్ మాటల్లో!

Sat 26th Mar 2016 11:22 PM
oopiri,vv vinayak,vamsi paidipally,akhil,akhil second movie,vv vinayak about oopiri success  ఊపిరి, అఖిల్ గురించి వినాయక్ మాటల్లో!
ఊపిరి, అఖిల్ గురించి వినాయక్ మాటల్లో!
Advertisement
Ads by CJ

‘ఊపిరి’ వంటి ఎక్స్ ట్రార్డినరీ ఫిలిమ్ తీసిన వంశీ పైడిపల్లికి అభినందనలు

                                                   – సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్

మార్చి 25న విడుదలైన ఊపిరి సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఊపిరి సినిమాను చూసి అభినందిస్తున్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఊపిరి సినిమా వీక్షించారు.  అనంతరం వి.వి.వినాయక్ మాట్లాడుతూ 'ఊపిరి సినిమా చూశాను. ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. ఊపిరి చిత్రాన్ని ఒక విభిన్నమైన కథాంశంతో, కొత్త తరహా చిత్రాన్ని తీసిన వంశీపైడిపల్లిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాగార్జున వంటి పెద్ద హీరో ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడం చాలా గొప్ప విషయం. ఆయన సూపర్బ్ గా నటించారు. అలాగే కార్తీ, తమన్నా క్యారెక్టర్స్ కూడా బావున్నాయి. ఊపిరితో తెలుగు సినిమాకు ఊపిరి పోసిన పివిపిగారికి, యూనిట్ కు నా అభినందనలు. వంశీపైడిపల్లి, అఖిల్ రెండో సినిమా చేస్తున్నారని తెలిసి చాలా హ్యపీగా ఫీలయ్యాను.  వంశీ, అఖిల్ తో చేసే సినిమా డెఫనెట్ గా సూపర్ హిట్ అవుతుంది' అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ