Advertisementt

ఒట్టు తీసి గట్టుమీద పెట్టింది..!

Sat 26th Mar 2016 10:32 PM
sraddha kapoor,varsham movie remake,baghi,glamour show  ఒట్టు తీసి గట్టుమీద పెట్టింది..!
ఒట్టు తీసి గట్టుమీద పెట్టింది..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో శ్రద్దాకపూర్‌ది ప్రత్యేక స్థానం. ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్లయింది. ఈ ఆరేళ్లలో ఆమె ఏడు సినిమాల్లో నటిస్తే అందులో కేవలం రెండు మాత్రమే పెద్ద హిట్‌ అయ్యాయి. మిగిలినవి పెద్దగా ఆడలేదు. ఇంతకాలం ఎక్స్‌పోజింగ్‌కు, గ్లామర్‌షోకు ఈ భామ దూరంగా ఉంది. అందుకే ఆమెకు స్టార్‌ హీరోల సరసన అవకాశాలు రాకపోయినా యంగ్‌ హీరోలకు మాత్రం ఆమె ఫేవరేట్‌ హీరోయిన్‌గా మారింది. తాజాగా ఆమె గ్లామర్‌షో కూడా తప్పదని తెలుసుకొని అందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం తెలుగులో హిట్టయిన 'వర్షం' చిత్రానికి రీమేక్‌గా రానున్న 'బాఘీ' చిత్రంలోని ఓ ఐటంసాంగ్‌లో ఆమె రెచ్చిపోయింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌లోని ఆమెను గ్లామర్‌షోను చూసి అందరూ షాక్‌కు గురవుతున్నారు. 'సబ్‌ తేరా..' సాంగ్‌లో ఆమె అదరగొడుతూ కుర్రకారులో సెగలు పుట్టిస్తోంది. మరి ఈ చిత్రం బాగా హిట్టయితే శ్రద్దాకపూర్‌ కూడా త్వరలోనే స్టార్‌హీరోల సరసన చాన్స్‌ను దక్కించుకునే అవకాశం ఉందని బాలీవుడ్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ