వాస్తవానికి టాలీవుడ్ నెంబర్‌వన్ రేసులో పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబులు ముందున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు డ్యాన్స్‌లలో చాలా వీక్. ఎన్టీఆర్, అల్లుఅర్జున్, రామ్‌చరణ్, రామ్ వంటి హీరోలతో పోలిస్తే స్టెప్స్ విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కానీ '1' (నేనొక్కడినే), 'ఆగడు', 'శ్రీమంతుడు' వంటి చిత్రాల్లో స్టెప్స్ విషయంలో చాలా కష్టపడి బాగానే చేశాడు అనే గుర్తింపును సాధించాడు మహేష్. కాగా ఇప్పుడు పవన్‌కళ్యాణ్ సైతం తన 'సర్దార్‌గబబ్బర్‌సింగ్' చిత్రంలో తన మనసు మార్చుకొని స్టెప్స్ విషయంలో అదరగొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం కోసం ఆయన కొత్తదారిలో పయనించాలని డిసైడ్ అయ్యాడని, ఆయన ఈ చిత్రంలోని పాటల్లో డ్యాన్స్ మూమెంట్స్‌తో ఇరగదీశాడని అంటున్నారు. దీనికి సాక్ష్యంగా ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ ప్రొమోలో, ఐటంసాంగ్ టీజర్‌లో కూడా ఆయన స్టెప్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎంతో కష్టమైన మూమెంట్స్‌ను కూడా పవన్ ఈజీగా చేసినట్లు కనిపిస్తోంది. కేవలం ట్రైలర్లలోనే ఇంతటి ఆసక్తిని రేపుతున్న పవన్ ఈ చిత్రంలోని పాటల్లో అదిరిపోయే చిందులు వేశాడని, ఆయన డ్యాన్స్ సూపర్‌గా ఉందని, అన్ని పాటల్లోను ఇదే తరహాలో ఆయన అందరినీ అదిరిపోయేలా చేయడం ఖాయమని ఫిల్మ్‌వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఈచిత్రంతో అభిమానులకే కాదు.. సాధారణ ప్రేక్షకులకు కూడా స్వీట్‌షాక్ ఇవ్వడానికి పవన్ రెడీ అవుతున్నాడు. మొత్తానికి ఈ చిత్రానికి పవన్ డ్యాన్స్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా మారనున్నాయనేది వాస్తవం. సో.. బీ రెడీ..! తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం నైజాంహక్కులను తన దగ్గరే ఉంచుకొన్న ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తాజాగా నైజాం హక్కులను ఇంద్రా ఫిల్మ్స్ వారికి 20కోట్లకు అమ్మినట్లు సమాచారం.కాగా ఇక్కడ 'బాహుబలి' రైట్స్ 24 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే..!