Advertisementt

నాజూకుగా మారిన బొద్దుగుమ్మ..!

Sat 26th Mar 2016 04:18 PM
namitha,pottu movie,aghori role in pottu movie  నాజూకుగా మారిన బొద్దుగుమ్మ..!
నాజూకుగా మారిన బొద్దుగుమ్మ..!
Advertisement
Ads by CJ

'జెమిని' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నమిత అప్పట్లో తన అందం, నాజూకుతనంతో అందరినీ ఆకట్టుకుంది. తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ స్ధిరపడిన ఆమె భారీగా లావెక్కింది. బొద్దుగుమ్మలను ఎక్కువగా ఆరాధించే తమిళ ప్రేక్షకుల అభిరుచి మేరకు ఆమె బాగా లావెక్కినప్పటికీ తమిళ ప్రేక్షకులు మాత్రం ఆమెను విపరీతంగా ఆరాధిస్తూ, ఏకంగా ఆమెకు గుళ్లు కట్టేంతగా అభిమానించారు. కానీ రానురాను ఆమె ఇక సినిమాలకు పనికిరాని విధంగా మరీ ఓవర్‌గా లావెక్కింది. దాంతో ఆమెకు సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. గత మూడేళ్లుగా నమిత వార్తల్లో లేదు. ఆమె నటించిన చిత్రాలు కూడా లేవు. ఇన్నాళ్లు సినిమాలకు దూరమైన నమిత బరువు తగ్గేందుకు ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌ తీసుకుని కాస్త బరువు తగ్గి మళ్లీ నాజూకుగా తయారైంది. ఇప్పుడు మరలా ఆమె తన అభిమానుల్లో ఆశలు రేకెతిస్తోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో 'పొట్టు' అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో నమిత అఘోరాలను తలపించే షాకింగ్‌లుక్‌తో కనపించనుంది. ఈ చిత్రానికి వడి ఉదయన్‌ దర్శకుడు. ఇదో హర్రర్‌ మూవీ. ఈ ఏడాది ద్వితీయార్దంలో ఈచిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా తర్వాత తన కెరీర్‌ తమిళంలో మరలా పుంజుకుంటుందనే ఆశతో నమిత ఉంది. మరి ఆమె ఆశ నెరవేరుతుందో? లేదో? చూడాలి..! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ