తన కెరీర్‌లో వవన్‌కళ్యాణ్‌తో సినిమా తీయడమే తన అంతిమ లక్ష్యంగా చెప్పుకున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు పవన్‌కు తగ్గ స్టోరీ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ పవన్ ఇమేజ్‌కు తగ్గ స్టోరీ మాత్రం ఇప్పటివరకు అతనికి దొరకలేదు. దీంతో దిల్‌రాజు ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాది కానుకగా విడుదలకు సిద్దమవుతోన్న తమిళస్టార్ విజయ్ నటిస్తున్న 'తేరీ' చిత్రంపై కన్నేశాడు. ఈ చిత్రం డబ్బింగ్ హక్కులతో పాటు వీలుంటే రీమేక్ చేయడానికి కూడా ఆయన సిద్దమైపోయి తమిళ నిర్మాతల నుండి ఈ చిత్రం హక్కులను పొందాడని,విజయ్ చిత్రాలకు తెలుగులో డిమాండ్ లేనప్పటికీ కేవలం సినిమా హిట్ అయితే పవన్‌తో ఈచిత్రాన్ని రీమేక్ చేయాలనే దూరదృష్టితోనే ఆయన ఈ చిత్రం రైట్స్‌ను కొనుగోలు చేశాడని సమాచారం. కాగా ఈ చిత్ర దర్శకుడు అట్లీకుమార్‌తో కూడా దిల్‌రాజుకు మంచి సాన్నిత్యం ఉందని, దాంతో దర్శకుడి నుండి స్టోరీ విని మరీ ఈ పాత్రకు పవన్ అయితే సరిపోతాడనే ఉద్దేశ్యంతో దిల్‌రాజు ఉన్నాడట. కాగా ప్రస్తుతం ఆయన మరో మెగాహీరో, మెగామేనల్లుడు నటిస్తున్న 'సుప్రీం' చిత్రంపై కూడా బాగా ఆశలు పెట్టుకొని ఉన్నాడు. భవిష్యత్తులో మంచి మాస్ హీరోగా తయారయ్యే అవకాశాలు పుష్కళంగా ఉన్న సాయిధరమ్‌తేజ్‌ను ఇప్పటినుందే దిల్‌రాజు తన అదుపులో పెట్టుకుంటున్నాడు. సాయి నటించే ఇతర చిత్రాల కథలను కూడా దిల్‌రాజుకు వినిపించి, ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన చిత్రాలనే సాయి ఒప్పుకుంటున్నాడని, మొత్తానికి సాయి దిల్‌రాజ్‌ను గాడ్‌ఫాదర్‌గా భావిస్తున్నాడని, అతని అండదండలు తనకు అవసరం అని సాయి భావిస్తున్నాడట. కాగా సాయి నటించే 'తిక్క' చిత్రం కూడా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ టైటిల్‌ను కూడా దిల్‌రాజే సూచించాడట. మరోవైపు సాయిధరమ్‌తేజ్‌తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి 'విన్నర్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. 'సుప్రీం, తిక్క'తోపాటు చిరంజీవి నటించిన 'విజేత' టైటిల్‌నే ఇప్పుడు ఇంగ్లీషులో ఈ చిత్రానికి పెట్టారని, ఇదంతా దిల్‌రాజు ప్లానింగ్ ప్రకారమే జరుగుతోందని సమాచారం.