సందీప్‌కిషన్ హీరోగా అనీషా ఆంబ్రోస్ హీరోయిన్‌గా ఇటీవల విడుదలైన చిత్రం 'రన్'. తమిళం, మలయాళంలో ఘనవిజయం సాధించిన 'నేరమ్' చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. కానీ తొలిషోకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు అనిల్ కన్నేగంటి విఫలయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. కాగా ఈ చిత్రం రీమేక్ హక్కులను దర్శకరత్న దాసరినారాయణరావు రెండేళ్ల కిందటే కొని,తన దగ్గర ఉంచుకున్నాడు. తన తనయుడు అరుణ్‌బాబుతో ఈ చిత్రం చేసి హిట్ ఇవ్వాలనే ఉద్ధేశ్యంతోనే ఆయన ఈ హక్కులను సొంతం చేసుకున్నాడు. కానీ పలు కారణాల వల్ల దాసరి ఈ చిత్రం రీమేక్‌ను పక్కన పెట్టేశాడు. దాంతో దాసరి వద్ద నుండి ఈ హక్కులను కొనుగోలు చేసిన ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అధినేతలు రామబ్రహ్మం, అనిల్‌సుంకరలు సందీప్‌కిషన్ హీరోగా ఈచిత్రాన్ని తీసి ఇప్పుడు సగం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకపోవడంతో దిగాలుపడ్దారు. మొత్తానికి రీమేక్ హక్కులను కొన్నప్పటికీ ఈ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను మెప్పించలేదని పక్కనపెట్టిన దాసరి నిర్ణయమే కరెక్ట్ అని విశ్లేషకులు అంటున్నారు.